View November Offers
1 min read1.6K Views

TVS Jupiter శ్రేణి ఉత్పత్తి కోటి యూనిట్ల మైలురాయిని దాటింది

ఈ మైలురాయిని అధిగమించిన రెండో భారతీయ స్కూటర్‌గా టీవీఎస్ జూపిటర్...

ప్రముఖ ఫ్యామిలీ స్కూటర్ జూపిటర్‌తో టీవీఎస్ మోటార్ కంపెనీ మరో కీలక మైలురాయిని సాధించింది. 2013లో పరిచయం చేసినప్పటి నుంచి ఈ స్కూటర్‌కు చెందిన 1 కోటి యూనిట్లకు పైగా వాహనాలను కంపెనీ తయారు చేసింది. ఈ సంఖ్యలో జూపిటర్ 110, జూపిటర్ 125 రెండూ ఉన్నాయి. దీంతో ఈ మైలురాయిని సాధించిన అతి తక్కువ వయసున్న, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన భారతీయ స్కూటర్ బ్రాండ్‌గా టీవీఎస్ నిలిచింది.

పెరుగుతున్న ఆదరణ

టీవీఎస్ జూపిటర్ను భారత స్కూటర్ మార్కెట్‌లో కొన్నేళ్లుగా ఆధిపత్యం చెలాయిస్తున్న హోండా యాక్టివాకు పోటీగా కంపెనీ పరిచయం చేసింది. తొలి ఏడాదిలోనే జూపిటర్‌ను 5 లక్షల మంది కొనుగోలు చేశారు. ఇక 2022లోనే ఈ స్కూటర్ ఉత్పత్తి 50 లక్షల యూనిట్ల మైలురాయిని చేరుకుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తొలి 50 లక్షల యూనిట్లను తయారు చేయడానికి టీవీఎస్‌కు 9 ఏళ్లు పట్టగా, తర్వాతి 50 లక్షల యూనిట్లను కేవలం 4 ఏళ్లలోనే తయారు చేసింది. భారతీయ కొనుగోలుదారుల్లో జూపిటర్‌కు ఎంత ఆదరణ పెరిగిందో ఇది తెలియజేస్తోంది.

టీవీఎస్ జూపిటర్ ఇంత ప్రజాదరణ పొందడానికి కారణమేంటి?

జూపిటర్‌ను మార్కెట్‌లో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉంచేందుకు టీవీఎస్ ఎప్పటికప్పుడు పలు మార్పులు చేస్తూ వచ్చింది. 2021లో జూపిటర్ 125ను పరిచయం చేసి ఈ శ్రేణిని విస్తరించింది. ఆ తర్వాత 2024లో జూపిటర్ 110లో భారీ మార్పులు చేసింది. అప్‌డేట్ చేసిన జూపిటర్ 110లో మరింత స్టైలిష్ డిజైన్, మార్పులు చేసిన ఛాసిస్, 125 సీసీ సోదర మోడల్ నుంచి తీసుకున్న కొత్త ఇంజిన్, ఫ్రంట్ అప్రాన్‌పై అమర్చిన ఫ్యూయల్ ఫిల్లర్ వంటి మార్పులు వచ్చాయి. దీని ఆచరణాత్మకమైన డిజైన్, సౌకర్యవంతమైన ఫీచర్లు, కుటుంబ అవసరాలకు అనుకూలమైన స్వభావం రోజువారీ ప్రయాణాలకు దీన్ని ఆకర్షణీయమైన ఎంపికగా నిలుపుతున్నాయి.

బైక్దెకో అభిప్రాయం..

జూపిటర్‌తో పాటు ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా భారతదేశంలో రెండో అతిపెద్ద స్కూటర్ తయారీ సంస్థగా టీవీఎస్ ఎదగడంలో కీలక పాత్ర పోషించాయి. ప్రస్తుతం జూపిటర్ 110 ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ధరలు రూ.74,700 నుంచి ప్రారంభమై రూ.90,525 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఇక జూపిటర్ 125 ధరలు రూ.83,000 నుంచి ప్రారంభమై రూ.91,235 (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. ఈ రెండు స్కూటర్లలోనూ ఆకర్షణీయమైన ఆధునిక డిజైన్, నమ్మకమైన, సమర్థవంతమైన ఇంజిన్లు, సౌకర్యవంతమైన రైడ్ క్వాలిటీ, అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ అంశాలన్నీ కలిపి 110 సీసీ నుంచి 125 సీసీ స్కూటర్ విభాగంలో జూపిటర్ సిరీస్‌ను పరిగణనలోకి తీసుకోదగిన మంచి ఎంపికగా నిలుపుతున్నాయి.

టీవీఎస్ జూపిటర్ 125 స్పెషల్ ఎడిషన్‌ను కంపెనీ నిలిపివేసింది.

User Reviews

I give 5star rating

Very supper scooter, best boot space, best mileage, supper comfort, excellent look, zero maintenance, super service tvs is friendly company, in tvs any bike is nice, i have already two bikes in tvs comapny one is tvs apache rtr160 4v, 2nd is tvs zupiter 125.Read More

Awesome Bike

TVS Jupiter is a very good-looking and reasonably priced bike with very nice pickup. Its engine power is strong, the riding experience is really smooth. The lighting system is beautiful. TVS Jupiter parts are available in almost every city and village. My favourite bike is the TVS Jupiter.Read More

Topics mentioned in the article
Share via
PranavCorrespondent Follow on Instagram
Pranav Singh Rawat is a Correspondent with the CarDekho Group, covering motorcycles, emerging mobility trends, and the Indian two-wheeler industry. A Mechanical Engineering graduate, he combines technical expertise with a rider-first perspective to create engaging and informative automotive content. Passionate about all kinds of motorcycles, from sportbikes to adventure tourers, he brings real-world riding experience and industry insights to his work, helping enthusiasts and buyers make informed decisions.
Read More

Trending Scooters

  • Popular
  • Upcoming
Honda Activa
Rs 90,870* Onwards
Suzuki Access 125
Rs 1,00,835* Onwards
TVS NTORQ 125
Rs 98,869* Onwards
TVS iQube
Rs 1,30,075* Onwards
TVS Jupiter
Rs 87,713* Onwards
*Ex-showroom price in Delhi