• English
    • Login / Register

    బ్రేకింగ్: మోటోవర్స్ 2026లో ప్రదర్శించిన రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6

    Pranav
    PranavModified On नवंबर 27, 2026 06:33 pm IST
    info icon
    Published Onनवंबर 27, 2026 02:18 pm IST
    Last Updated Onनवंबर 27, 2026 06:33 pm IST
    1075 Views

    ఫ్లయింగ్ ఫ్లీ C6కు ఆఫ్-రోడ్ రైడింగ్‌కు అనువైన వెర్షన్

    FF S6

    ముఖ్యాంశాలు

    లాంగ్-ట్రావెల్ సస్పెన్షన్‌తో వస్తుంది.

    C6 మాదిరిగా కాకుండా సంప్రదాయ చైన్ డ్రైవ్‌ను కలిగి ఉంటుంది.

    2027లో భారతదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

    EICMA 2026లో ఫ్లయింగ్ ఫ్లీ S6ను అంతర్జాతీయంగా ఆవిష్కరించిన తర్వాత, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు రాబోయే ఈ స్క్రాంబ్లర్ బైక్‌ను మోటోవర్స్ 2026లో ప్రదర్శించింది. S6ను తొలిసారిగా 2025 మోటోవర్స్‌లో భారతదేశంలో ప్రదర్శించారు. పట్టణ ప్రయాణాలపై ఎక్కువగా దృష్టి సారించే ఫ్లయింగ్ ఫ్లీ C6తో పోలిస్తే, S6ను మరింత విభిన్నమైన ప్రయాణాలకు అనువుగా, సరదాగా నడిపే ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా రూపొందించారు. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు ఇవే:

    నియో-రెట్రో స్క్రాంబ్లర్ లుక్

    FF S6

    ఫ్లయింగ్ ఫ్లీ S6లో C6 మాదిరిగానే సన్నని బాడీ ప్రొఫైల్, రౌండ్ LED హెడ్‌లైట్‌ను కొనసాగించారు. అయితే, దీనికి సరైన స్క్రాంబ్లర్ రూపాన్ని అందించేలా పలు ప్రత్యేకమైన డిజైన్ అంశాలను జోడించారు. వాటిలో ఎత్తుగా అమర్చిన ఫ్రంట్ ఫెండర్, వెడల్పాటి సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్, నకిల్ గార్డ్స్, ఫ్లాట్ సింగిల్-పీస్ సీటు, మందపాటి డ్యూయల్-పర్పస్ టైర్లతో కూడిన స్పోక్ వీల్స్ ఉన్నాయి. మొత్తంగా చూస్తే, రోడ్‌స్టర్ వెర్షన్‌తో పోలిస్తే ఈ బైక్ మరింత బలిష్టమైన రూపాన్ని కలిగి ఉంది.

    బ్యాటరీ, మోటార్, పనితీరు

    FF S6

    ఫ్లయింగ్ ఫ్లీ S6 మోటార్, బ్యాటరీ స్పెసిఫికేషన్లను రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంకా వెల్లడించలేదు. అయితే, ఫ్లయింగ్ ఫ్లీ C6లో ఉన్న తరహా స్పెసిఫికేషన్లే ఇందులోనూ ఉండవచ్చని అంచనా వేస్తున్నాం. ఉదాహరణకు, C6లో 15.4 kW ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఇది 60 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 0 నుంచి 60 kmph వేగాన్ని అందుకోవడానికి 3.7 సెకన్లు పడుతుందని కంపెనీ పేర్కొంది. దీని గరిష్ఠ వేగం 115 kmphగా ఉంది. ఇందులో 3.91 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఇది IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) ప్రకారం 154 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది.

    FF S6

    ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బెల్ట్ డ్రైవ్‌తో వచ్చే ఫ్లయింగ్ ఫ్లీ C6కు భిన్నంగా, S6లో పెద్ద రియర్ స్ప్రాకెట్‌తో కూడిన సంప్రదాయ చైన్ డ్రైవ్‌ను అందించారు. తక్కువ గేరింగ్ రేషియో కారణంగా ఈ ఎలక్ట్రిక్ స్క్రాంబ్లర్ ప్రారంభ వేగంలో మెరుగైన పుల్‌ను, మరింత వేగవంతమైన థ్రాటిల్ రెస్పాన్స్‌ను అందించవచ్చు. వదులుగా ఉండే రోడ్లపై ప్రయాణించేటప్పుడు కూడా ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

    అండర్‌పిన్నింగ్స్

    FF S6

    C6లో కొంత భిన్నంగా ఉండే గిర్డర్-స్టైల్ ఫ్రంట్ సస్పెన్షన్‌ను అందించగా, S6లో సంప్రదాయ ఇన్వర్టెడ్ ఫోర్క్‌ను ఏర్పాటు చేశారు. దీనితో పాటు ప్రీలోడ్ అడ్జస్ట్ చేసుకునే మోనోషాక్‌ను కూడా అందించారు. ఈ బైక్ ముందు 19-అంగుళాల, వెనుక 18-అంగుళాల స్పోక్ వీల్స్‌పై ప్రయాణిస్తుంది. రెండు వైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

    ఫీచర్లు

    FF S6

    ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్లో స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, SMS, కాల్ అలర్ట్స్‌కు సపోర్ట్ చేసే 3.5-అంగుళాల సర్క్యులర్ TFT టచ్‌స్క్రీన్‌ను అందించారు. ఇతర ఫీచర్లలో 4G కనెక్టివిటీ, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్, వివిధ రైడింగ్ మోడ్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-ఛానల్ ABS ఉన్నాయి.

    బైక్దెకో అభిప్రాయం..

    ఫ్లయింగ్ ఫ్లీ S6తో సంప్రదాయ అర్బన్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కంటే మరింత ఆసక్తికరమైన రైడింగ్ అనుభూతిని కోరుకునే ఔత్సాహికులను రాయల్ ఎన్‌ఫీల్డ్ లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. దీని బలిష్టమైన డిజైన్, విభిన్నమైన స్ప్రాకెట్ సెటప్, సంప్రదాయ సస్పెన్షన్ అమరిక కారణంగా నగర ప్రయాణాలతో పాటు అప్పుడప్పుడు ట్రయల్స్‌పై కూడా సరదాగా నడిపే బైక్‌గా నిలవవచ్చు.

    రాయల్ ఎన్‌ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ S6ను 2027లో భారతదేశంలో విడుదల చేయవచ్చని అంచనా. దీని ధర సుమారు రూ.3 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. మార్కెట్లోకి వచ్చిన తర్వాత దీనికి ప్రధాన ప్రత్యర్థిగా అల్ట్రావయొలెట్ షాక్‌వేవ్ నిలిచే అవకాశం ఉంది.

    Flying Flea S6 (Royal Enfield) User Reviews

    • M
      moirangthem on नवंबर 03, 2026
      4.5
      Very good and futuristic bike.
      One of the best e-bike will be available on the market. But the feel for Royal Enfield brand is off. While everybody is talking about ev some people prefers gasoline cruiser bikes because there is an undeniable feeling of satisfaction on riding a gasoline engine bike. For bike lovers, gasoline bikes appeal more.
      Read More
      2 82
    Was this article helpful ?

    Pranav
    Correspondent
    Pranav Singh Rawat is a Correspondent with the CarDekho Group, covering motorcycles, emerging mobility trends, and the Indian two-wheeler industry. A Mechanical Engineering.....Read more

    Write your Comment

    Read Full News

    Trending Bikes

    • Popular
    • Upcoming
    *Ex-showroom price in Delhi
    ×
    We need your city to customize your experience