1 min read1.4K Views

KTM 390 అడ్వెంచర్ X కోసం టాప్‌ 5 టైర్లు: మా సిఫార్సులు

మీ రాబోయే అడ్వెంచర్‌ ప్రయాణాల కోసం ఎంచుకోదగిన అత్యుత్తమ టైర్లు...

Team BikedekhoPublished On नवंबर 26, 2026 19:05 IST
Published Onनवंबर 25, 2026 09:00 IST
Last Updated Onनवंबर 26, 2026 19:05 IST

KTM 390 Adventure X అనేది 390 అడ్వెంచర్‌ శ్రేణిలో అత్యంత సరసమైన వేరియంట్లలో ఒకటి. ఇది రోడ్లపై ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే వెర్షన్‌. ఇందులో ముందు భాగంలో 19 అంగుళాల, వెనుక భాగంలో 17 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను అందించారు. అయితే, సాధారణ రహదారులు లేని ప్రాంతాల్లోనూ ప్రయాణించగల సామర్థ్యం దీనికి ఉంది. వివిధ రకాల రోడ్లు, భూభాగాలపై స్థిరమైన హ్యాండ్లింగ్‌ పొందాలంటే సరైన టైర్లను ఎంచుకోవడం అవసరం. KTM 390 అడ్వెంచర్ X కోసం మేము సిఫార్సు చేస్తున్న టాప్‌ 5 టైర్లు ఇవే.

యూరోగ్రిప్‌ ట్రైల్‌హౌండ్‌ STR

యూరోగ్రిప్‌ Trailhound STR టైర్‌ రోడ్లపై మంచి పనితీరుతో పాటు, ఆఫ్‌-రోడింగ్‌ సామర్థ్యం మధ్య చక్కని సమతుల్యతను అందిస్తుంది. ఇందులో 0-డిగ్రీ స్టీల్‌ బెల్ట్‌ నిర్మాణం ఉండటం వల్ల అధిక వేగాల్లోనూ స్థిరమైన ఫీడ్‌బ్యాక్‌ను అందిస్తుంది. బురదతో కూడిన ప్రాంతాలు, తడి రహదారులు సహా సాధారణ రోడ్లు లేని ప్రాంతాల్లో ప్రయాణించినప్పుడు కూడా దీని ప్రత్యేకమైన ట్రెడ్‌ ప్యాటర్న్‌, వెనుక రేడియల్‌ టైర్‌లోని క్వాడ్రాజోన్‌ మల్టీకంపౌండ్‌ టెక్నాలజీ కారణంగా నమ్మకమైన గ్రిప్‌ లభిస్తుంది. మైలేజీ విషయంలో రాజీ పడకుండా అద్భుతమైన గ్రిప్‌ను అందించేలా ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన కాంపౌండ్‌ను కూడా ఇందులో ఉపయోగించారు. దీంతో బైక్‌ను వేగంగా నడిపినప్పటికీ రైడర్‌కు స్థిరమైన అనుభూతి లభిస్తుంది. రోజువారీ వినియోగం, హైవే టూరింగ్‌, ఆఫ్‌-రోడింగ్‌.. ఇలా అన్ని రకాల అవసరాలకూ సరిపోయే టైర్‌ కావాలనుకునేవారికి ట్రైల్‌హౌండ్‌ STR మంచి ఎంపిక.

అపోలో ట్రాంప్లర్‌ XR 

అపోలో ట్రాంప్లర్‌ XR అనేది రోడ్లపై ప్రయాణానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే టైర్‌. ముఖ్యంగా హైవే టూరింగ్‌ను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. రోడ్డుపై తక్కువ శబ్దం వచ్చేలా ఉండటం వల్ల సుదూర హైవే ప్రయాణాలకు ఇది అనుకూలంగా ఉంటుంది. దీని మందపాటి ట్రెడ్‌ ప్యాటర్న్‌ స్వల్ప స్థాయి ఆఫ్‌-రోడింగ్‌ మార్గాల్లోనూ ప్రయాణించేందుకు సహాయపడుతుంది.

రైజ్‌ టూర్‌R


రైజ్‌ టూర్‌R అనేది అడ్వెంచర్‌ టూరింగ్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన టైర్‌. ప్రధానంగా హైవేలపై ఎక్కువ దూరం ప్రయాణించడంతో పాటు, స్వల్ప స్థాయి ఆఫ్‌-రోడింగ్‌కు అనుకూలంగా దీన్ని తయారు చేశారు. బురదతో కూడిన పరిస్థితుల్లోనూ రైడర్‌కు మంచి గ్రిప్‌ను అందిస్తుంది. గ్రామీణ రహదారులు, హైవేలు, గుంతలతో కూడిన రోడ్లు వంటి విభిన్న పరిస్థితుల్లో ప్రయాణించే టూరింగ్‌ రైడర్లకు ఈ టైర్‌ సరిపోతుంది. అంతేకాకుండా, సాధారణంగా వెళ్లని ప్రత్యేకమైన ప్రాంతాలకూ ఈ టైర్‌తో ప్రయాణించవచ్చు.

మెట్జెలర్‌ టూరాన్స్‌


మెట్జెలర్‌ టూరాన్స్‌ అనేది ఆ బ్రాండ్‌ నుంచి లభించే ప్రీమియం డ్యూయల్‌-స్పోర్ట్‌ టైర్‌. ప్రధానంగా రోడ్లపై ప్రయాణం, అప్పుడప్పుడు ఆఫ్‌-రోడింగ్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దీన్ని రూపొందించారు. ఇందులో వెడల్పైన గ్రూవ్స్‌ ఉండటం వల్ల తడి రహదారులపై ప్రయాణించేందుకు, ఆఫ్‌-రోడింగ్‌ సమయంలో మంచి గ్రిప్‌ పొందేందుకు సహాయపడతాయి. అయితే, ఇది పూర్తిగా ఆఫ్‌-రోడింగ్‌కు ప్రాధాన్యతనిచ్చే టైర్‌ కాదు. రోజువారీ వినియోగం, హైవే ప్రయాణాలకు మాత్రం మంచి ఎంపికగా నిలుస్తుంది.

మ్యాక్సిస్‌ మ్యాక్స్‌ప్లోర్‌


రోజువారీ వినియోగానికి అనువైన టైర్‌ కోసం చూస్తున్నవారికి మ్యాక్సిస్‌ మ్యాక్స్‌ప్లోర్‌ మంచి ఎంపిక. ఇది మంచి గ్రిప్‌తో పాటు మెరుగైన బ్రేకింగ్‌ పనితీరును అందిస్తుంది. దీని మందపాటి సైడ్‌వాల్స్‌ రోడ్డుపై ఉండే గుంతలు, కుదుపుల ప్రభావాన్ని గ్రహిస్తాయి. దీంతో రైడర్‌కు మరింత సౌకర్యవంతమైన, స్థిరమైన ప్రయాణ అనుభూతి లభిస్తుంది. మొత్తంగా చూస్తే, పనితీరు, ధరకు తగిన విలువ పరంగా ఇది మంచి సమతుల్యతను అందిస్తుంది.

Share via
Team Bikedekho
The BikeDekho community offers auto enthusiasts a friendly home where they can get all the movements of the Indian two-wheeler industry. The website provides you all the latest news of the industry along with the reviews, pictures, specifications, features and prices of all the two-wheelers available in India. BikeDekho.com also provides road-test reviews of latest two-wheelers in India given by expert hands and advisory stories, which can help you to maintain your vehicle in different conditions.
Read More
*Ex-showroom price in Delhi