• ULTRAVIOLETTE
  • X47 VENOM
  • Price
  • Images
  • Compare
  • Specs
  • Colours
  • X47 Venom EMI
  • User Reviews
  • Range
  • More
View November Offers
1 min read973 Views

భారత్‌లో Ultraviolette X-47 వెనం డెలివరీలు ప్రారంభం

తొలి విడతలో బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు బైక్‌లను అందించడం...

Explore Ultraviolette X47 Venom in Detail
Ultraviolette X47 Venom₹ 2,65,000* Onwards
View More Details

ముఖ్యమైన వివరాలు

  • అల్ట్రావయొలెట్ X-47 వెనం బైక్‌ను నెల రోజుల క్రితం మార్కెట్లోకి విడుదల చేశారు.
  • దేశవ్యాప్తంగా డెలివరీలు ప్రారంభమయ్యాయి.
  • 100V ఆర్కిటెక్చర్‌తో వచ్చిన సంస్థ తొలి మోటార్‌సైకిల్ ఇదే.

అల్ట్రావయొలెట్ తన X-47 వెనం ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ డెలివరీలను ప్రారంభించింది. ADV తరహా డిజైన్‌తో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను నెల రోజుల క్రితం ఢిల్లీలో రూ.2,65,000 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో విడుదల చేశారు. 100V ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉన్న సంస్థ తొలి మోటార్‌సైకిల్ ఇదే.

ప్రస్తుతం అల్ట్రావయొలెట్‌కు దేశవ్యాప్తంగా 58 అవుట్‌లెట్లు ఉన్నాయి. తొలి విడతలో బుక్ చేసుకున్న కస్టమర్లకు దశలవారీగా డెలివరీలు ప్రారంభించింది. త్వరలోనే మరిన్ని భారతీయ నగరాల్లోని షోరూమ్‌ల నుంచి ఈ ఎలక్ట్రిక్ క్రాసోవర్ బైక్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

X-47 వెనం కేవలం 2.7 సెకన్లలో 0 నుంచి 60 kmph వేగాన్ని, 5.9 సెకన్లలో 0 నుంచి 100 kmph వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఈ గణాంకాలన్నీ కంపెనీ వెల్లడించినవే. X47 క్రాసోవర్తో పోలిస్తే, 100 kmph వేగాన్ని అందుకోవడానికి వెనం 2.3 సెకన్లు తక్కువ సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా, X47 క్రాసోవర్‌తో పోలిస్తే ఈ బైక్ దాదాపు 20 కిలోల బరువు తక్కువగా ఉంటుంది. దీని గరిష్ఠ వేగం కూడా గతంలో ఉన్న 145 kmph నుంచి 155 kmphకు పెరిగింది.

ఫీచర్ల విషయానికొస్తే, కొత్త 7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్‌ను అందించారు. వేరియంట్‌ను బట్టి Bluetooth, Wi-Fi, LTE కనెక్టివిటీ సదుపాయాలు ఉంటాయి. క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రీజనరేటివ్ బ్రేకింగ్, హిల్ హోల్డ్, పార్క్ అసిస్ట్ (ముందుకు, వెనక్కి కదిలే మోడ్‌లతో) వంటి ఫీచర్లు మరెన్నో ఇందులో ఉన్నాయి. దీంతో భారత్‌లో కొనుగోలు చేయగల అత్యధిక ఫీచర్లు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లలో ఇది ఒకటిగా నిలుస్తుంది.

బైక్దెకో అభిప్రాయం..

అధునాతన ఫీచర్లు, మంచి పనితీరు కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కోసం చూస్తున్నవారికి X-47 వెనం పరిశీలించదగిన మోడల్. అయితే, ADV తరహా మోటార్‌సైకిళ్లపై ఆసక్తి లేని వారు అల్ట్రావయొలెట్ F77ను కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది ఆ సంస్థ నుంచి వచ్చిన రోడ్-ఆధారిత స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్.

మీరు అల్ట్రావయొలెట్ X-47ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, సంస్థ ఒక ప్రత్యేక ప్రారంభ ఆఫర్‌ను అందిస్తోంది. తొలి 5,000 మంది కస్టమర్లకు ఈ బైక్ రూ.2,65,000 ప్రారంభ ధరతో లభిస్తుంది. ఈ బైక్‌కు ఇటీవల అప్‌డేట్ కూడా చేశారు. కాబట్టి, భవిష్యత్తులో రానున్న ఫీచర్లను కోల్పోతామనే ఆందోళన లేకుండా ఇప్పుడే ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను బుక్ చేసుకోవచ్చు.

Ultraviolette X47 Venom User Reviews

S
saketh on नवंबर 16, 2026
5.0
Recommended to buy

Best vehicle with high torque, with acceptable range, and charge time is also less compared to other vehicles, recommend to buy without any thinking, best vehicle in this price segment, sporty look, feels classy, great bike.Read More

S
shezin on नवंबर 13, 2026
4.8
One of the best EV with only a few cons.

I was never into EVs until I saw this bike. Not having to spend huge chunks of money on petrol has been a really nice thing. The performance of the bike is awesome and it feels really nice riding the bike. The only con will be a better and more service centre availability and less micro errors.Read More

Topics mentioned in the article
Share via
Basu Follow on Instagram
Basu Sivaraj is an economist by education and an automotive enthusiast at heart, a national racer with hands-on experience in demanding, competitive riding conditions. His journey spans from fixing bikes in a garage to competitive riding, endurance off-road events, and real-world testing.
Read More

Trending Bikes

  • Popular
  • Upcoming
KTM 160 Duke
Rs 2,11,195* Onwards
KTM 200 Duke
Rs 2,36,954* Onwards
Royal Enfield Hunter 350
Rs 1,73,646* Onwards
Hero Splendor Plus
Rs 94,418* Onwards
Royal Enfield Classic 350
Rs 2,28,285* Onwards
*Ex-showroom price in Delhi