• English
    • Login / Register

    కొత్త River ఎలక్ట్రిక్ స్కూటర్ స్పై.. త్వరలోనే మార్కెట్లోకి రానుందా?

    Amogh
    AmoghModified On नवंबर 20, 2026 08:50 pm IST
    info icon
    Published Onनवंबर 20, 2026 03:40 pm IST
    Last Updated Onनवंबर 20, 2026 08:50 pm IST
    1219 Views

    రివర్ ఇండీ కంటే దిగువ స్థానంలో ఈ కొత్త స్కూటర్‌ను ప్రవేశపెట్టే...

    New River Electric Scooter Spied

    ముఖ్యాంశాలు

    • రివర్ ఇండీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించినట్లు కనిపిస్తోంది.
    • ముందు, వెనుక భాగాల్లో 14 ఇంచ్ వీల్స్ ఉన్నాయి.
    • వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది.

    బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ రివర్ మొబిలిటీ రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. వీటికి అంతర్గతంగా RX02, RX03 అనే కోడ్‌నేమ్స్‌ను కేటాయించారు. వీటిలో ఒక స్కూటర్ ఇటీవల టెస్టింగ్ సమయంలో కనిపించింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

    స్పై చిత్రాల్లో ఏమి కనిపిస్తోంది?

    New River Electric Scooter Spied

    ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్ ఇండీ ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించినట్లు కనిపిస్తోంది. దీని సిల్హౌట్, ఎత్తైన విండ్‌స్క్రీన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్ వంటివి ఇండీని పోలి ఉన్నాయి. ఇందులో కొత్త LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్నటి LED టెయిల్‌లైట్ ఉన్నాయి. అలాగే ఇండీలో ఉన్న తరహాలోనే టర్న్ ఇండికేటర్లను కూడా అందించినట్లు కనిపిస్తోంది.

    New River Electric Scooter Spied

    ఈ స్కూటర్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలను రివర్ సంస్థ ఇంకా వెల్లడించలేదు. అయితే, కొత్త మోడల్‌లో ముందు, వెనుక భాగాల్లో 14 ఇంచ్ వీల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ట్విన్ షాక్ అబ్జార్బర్లు, రెండు వైపులా డిస్క్ బ్రేకులను అందించారు.

    New River Electric Scooter Spied

    కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇండీ తరహా బ్యాటరీ, మోటార్ సెటప్‌ను ఉపయోగించే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం రివర్ ఇండీలో 4 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందిస్తున్నారు. ఇది IDC (ఇండియన్ డ్రైవింగ్ కండిషన్స్) ప్రకారం 160 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఇందులో 6.7 kW గరిష్ఠ పవర్‌ను ఉత్పత్తి చేసే మోటార్‌ను అమర్చారు. ఇది 26 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు.

    అంచనా విడుదల

    కొత్త రివర్ స్కూటర్ వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, దీనికి అధికారికంగా ఏ పేరు పెట్టనున్నారనే విషయాన్ని సంస్థ ఇంకా ధ్రువీకరించలేదు.

    బైక్దెకో అభిప్రాయం

    త్వరలో రానున్న ఈ కొత్త స్కూటర్ చూడటానికి మంచి పరిమాణంతో, ప్రాక్టికల్ డిజైన్‌తో కనిపిస్తోంది. ఎత్తైన విండ్‌స్క్రీన్, ఫ్లాట్ ఫ్లోర్‌బోర్డ్, బలమైన రియర్ గ్రాబ్ హ్యాండిల్ వంటి ఉపయోగకరమైన అంశాలను ఇందులో అందించారు.అయితే, ఈ స్కూటర్‌కు సంబంధించిన సాంకేతిక వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. స్కూటర్ మార్కెట్లో విడుదలైనప్పుడు మాత్రమే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

    చిత్రాల మూలం

    Topics mentioned in the article
    Was this article helpful ?

    1 out of 1 found this helpful

    Amogh
    Junior Correspondent
    Amogh Wadikhaye is a Junior Correspondent with the CarDekho Group and an automotive journalist with experience covering motorcycles and the latest industry trends. As a Mechanical.....Read more

    Write your Comment

    Read Full News

    Trending Bikes

    • Popular
    • Upcoming
    *Ex-showroom price in Delhi
    ×
    We need your city to customize your experience